Samantha: సమంత బాలీవుడ్​ అరంగేట్రం చిత్రంపై ఆసక్తికర అప్​డేట్​!

Samantha Ruth Prabhu to Star in a Horror Film Directed by Amar Kaushik
  • ఆయుష్మాన్ ఖురానా సరసన హిందీకి పరిచయం కాబోతున్న సమంత
  • ‘స్త్రీ’ సినిమా ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాబోతున్న హారర్ చిత్రం
  • యువరాణి, దెయ్యం పాత్రల్లో నటించనున్న సమంత!
టాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా రాణించిన సమంత.. ఇప్పుడు బాలీవుడ్ లో నూ తన మార్కు చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ఇప్పటికే హిందీ జనాలకు చేరువైందామె. ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా బాలీవుడ్ లో ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో ప్యాన్ఇండియా హీరోయిన్ అయ్యే ప్రయత్నంలో భాగంగా సమంత పలు హిందీ చిత్రాలను ఒప్పుకుంది. తాప్సీ నిర్మాణంలో ఒక సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ కు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. 

అయితే, బాలీవుడ్లో ఆమె అరంగేట్రం చిత్రంపై మాత్రం రోజుకో వార్త వస్తోంది. మొన్నటిదాకా తాప్సీ సినిమాతోనే ఆమె హిందీకి పరిచయం అవుతుందని అనుకున్నారు. కానీ, మరో సినిమాకు సమంతం ఒప్పుకుందని, ఈ చిత్రమే ముందుగా సెట్స్ పైకి వెళ్లి, విడుదల అవుతుందని తాజా సమాచారం. వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా సరసన సమంత హీరోయిన్ గా  నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్త్రీ’ సినిమా ఫేమ్ అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది హారర్ చిత్రం అని, ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని సమాచారం. ఈ చిత్రం రాజస్థాన్ జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. చిత్రంలో సమంత రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజ్ పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రల్లో అలరించనున్నట్టు తెలుస్తోంది. ఇది నిజమైతే సమంత తన కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయనుంది.
Samantha
Tollywood
Bollywood
dual role
ayushman khurana

More Telugu News