Hanuman Chalisa: సీఎం యోగికి కానుకగా ఇచ్చేందుకు చెక్క బోర్డుపై హనుమాన్ చాలీసా

UP man carves Hanuman Chalisa on wooden board wants to gift it to CM Yogi
  • త్వరలో ముఖ్యమంత్రి యోగికి అందించే యోచన
  • ఎనిమిది నెలలు కష్టపడి తయారు చేసిన కాన్పూర్ కార్పెంటర్
  • గతంలో ఇలాగే ప్రధానికి భగవద్గీత బహూకరణ
కాన్పూర్ కు చెందిన కార్పెంటర్, చెక్క శిల్పకారుడు సందీప్ సోని మరోసారి తన ప్రత్యేకతను చాటుతున్నాడు. చెక్క బోర్డుపై హనుమాన్ చాలీసాను చెక్కాడు. ఇందుకు ఎనిమిది నెలల సమయం తీసుకుంది. దీన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బహుకరించాలన్నది అతడి యోచన. హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలను అతడు చెక్కపై తీర్చిదిద్దాడు. 

సందీప్ సోనీకి ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో భగవద్గీత శ్లోకాలను చెక్కపై అందంగా చెక్కి ప్రధాని నరేంద్ర మోదీకి అతడు బహూకరించాడు. ఆ సందర్భంలోనే అతడు ఎక్కువ మందికి పరిచయమయ్యాడు.
Hanuman Chalisa
wooden board
kanpur
carpenter

More Telugu News