'స్వాతిముత్యం' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్!

  • 'స్వాతిముత్యం'గా బెల్లంకొండ గణేశ్
  • హీరోగా ఈ సినిమాతోనే పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • అక్టోబర్ 5వ తేదీన విడుదల
Swathi Muthyam Movie Update

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమా రూపొందింది. తెలుగులో ఇదే ఆయన ఫస్టు మూవీ. ఆయన జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'డుమ్ డుమ్ డుమ్ డుమ్ మోగింది మేళం ..' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హీరోయిన్ ప్రేమ ఫలించి పెద్దలు అంగీకరించడం .. నిశ్చితార్థం జరిగిపోవడంతో, ఇక మిగిలింది పెళ్లే అన్నట్టుగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ పాట మొదలవుతుంది.   


 కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటని ఆదిత్య బృందం ఆలపించింది. అబ్బాయి .. అమ్మాయి గుణగణాలతో పాటు, పెళ్లి తంతుకి సంబంధించిన హడావిడిని ప్రతిబింబిస్తూ సాగిన పాట ఇది. రావు రమేశ్ .. నరేశ్ .. ప్రగతి .. శ్రీవాణి తదితరులు నటించిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News