Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హతం

2 Hizbul Terrorists Killed In Encounter
  • పోష్క్‌రీరి ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • గతేడాది ఓ కానిస్టేబుల్, ఇద్దరు పౌరులను హతమార్చింది వీరే
  • శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పేలుడు పదార్థాల స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పోష్క్‌రీరి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు నిన్న తనిఖీలు చేపట్టాయి. వారికి తారసపడిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వారిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన డానిష్ భట్ అలియాస్ కొకబ్ దూరీ, బషరత్ నబీగా గుర్తించారు.

వీరిద్దరూ గతంలో పౌరహత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2021లో సైనికుడి హత్యతోపాటు ఆ తర్వాతి నెలలో జబ్లీపురాలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 35 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం వాటిని పేలకుండా చేసి ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News