Girl: నెల్లూరు జిల్లాలో బాలికపై యాసిడ్ దాడి చేసింది మేనమామే: పోలీసులు

Police says uncle attacks on girl
  • బాలిక నోట్లో యాసిడ్ పోసి గొంతుకోసిన వ్యక్తి
  • లైంగిక దాడికి యత్నించాడంటూ తొలుత కథనాలు
  • పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాల వెల్లడి
  • డబ్బు కోసం మేనమామ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తింపు
నెల్లూరు జిల్లాలో ఓ బాలిక నోట్లో యాసిడ్ పోసి, గొంతుకోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు లైంగిక దాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తొలుత కథనాలు వచ్చాయి. అయితే, ఈ కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

ఆ 14 ఏళ్ల బాలికపై దాడి చేసింది మేనమామ నాగరాజు అని పోలీసులు వెల్లడించారు. నాగరాజు వ్యసనాలకు బానిసయ్యాడని, డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. కాగా, బాలికపై అత్యాచారం జరగలేదని, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మైనర్ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Girl
Attack
Uncle
Nellore District
Police

More Telugu News