Abhiram: దగ్గుబాటి అభిరామ్ 'అహింస' .. షూటింగు పూర్తి!

  • తేజ రూపొందించిన 'అహింస'
  • హీరోగా రానా తమ్ముడి పరిచయం 
  • కథానాయికగా గీతిక ఎంట్రీ
  • సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ  
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  
Ahimsa movie update

హీరోగా రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. చాలా కాలం క్రితమే మొదలైన షూటింగు కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఈ సినిమా టీమ్ ఒక ఫొటోను వదిలింది. 

దర్శకుడిగా తేజకి ప్రేమకథాచిత్రాల స్పెషలిస్టుగా మంచి పేరు ఉంది. ఆయన సినిమాల టైటిల్స్ కూడా కొత్తగా ఉంటాయి. అలాంటి తేజ ఈ సారి ఏ జోనర్లో తన సినిమాను వదలనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి ఆయన 'అహింస' అనే టైటిల్ పెట్టడమే అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. 

ఈ సినిమాలో అభిరామ్ జోడీగా గీతిక పరిచయం కానుంది. చాలా కాలంగా సినిమాలకి సంగీతాన్ని అందించడాన్ని పక్కన పెట్టేసిన ఆర్పీ పట్నానాయక్, ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తేజ - ఆర్పీ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News