Suresh Raina: సురేశ్ రైనాకు సీఎస్కే నుంచి ఊహించని ప్రశంసలు

Chennai Super Kings pay heartfelt tribute to Suresh Raina after retirement
  • నిన్ను ఎప్పటికీ మర్చిపోమన్న సీఎస్కే
  • థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ ప్రశంస
  • జట్టుకు నీవు ఒక గొప్ప ఆస్తి అని పేర్కొన్న అమిత్ మిశ్రా
అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు చెప్పిన సురేశ్ రైనా.. మాజీ క్రికెటర్లు, సీఎస్కే నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ‘‘మా ప్రతి ఒక్కరికీ చిన్న థలా అంటే ఏంటో అన్బుడెన్ (చెన్నై) వీధులు ఎప్పటికీ మర్చిపోవు. థన్యవాదాలు మిస్టర్ ఐపీఎల్’’ అని సీఎస్కే ప్రకటించింది. 

మాజీ క్రికెటర్లు అయిన ఇర్ఫాన్ పఠాన్, సుబ్రమణియం బద్రీనాథ్, అమిత్ మిశ్రా తదితరులు రైనా సేవలను కొనియాడారు. ‘‘దేశానికి, సీఎస్కేకు నీవు అందించిన సేవలను ప్రతి అభిమాని గుర్తుంచుకుంటారు. జట్టుకు నీవొక గొప్ప ఆస్తి. రిటైర్మెంట్ జీవితం గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని అమిత్ మిశ్రా ట్వీట్ చేశాడు. సురేష్ రైనా 2020లో యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్ కు ఆడలేదు. కరోనా కాలంలో కుటుంబానికి సన్నిహితంగా ఉండాలంటూ వచ్చేశాడు. ఇదే అతడి కెరీర్ కు ముగింపు అయింది.
Suresh Raina
retirement
Chennai Super Kings
tribute

More Telugu News