Poco M5: పోకో ఎం5 స్మార్ట్ ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు ఇవే..

  • రెండు వేరియంట్లలో లభ్యం
  • 4జీబీ, 64జీబీ ధర రూ.12.499
  • 6జీబీ, 128జీబీ ధర రూ.14,499
  • ఈ నెల 13న విక్రయాలు
Poco M5 with triple rear cameras 5000mAh battery launched in India specifications

చైనాకు చెందిన షావోమీ తన సబ్ బ్రాండ్ అయిన పోకో పేరుతో ఎం5 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 4జీ ఫోన్. మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ తో వచ్చే ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,499. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.14,499. 6జీబీ ర్యామ్ వెర్షన్ లో వర్చువల్ గా ర్యామ్ ను మరో 2జీబీ మేర పెంచుకోవచ్చు. 

పోకో ఎల్లో, ఐసీ బ్లూ, పవర్ బ్లాక్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో భాగంగా.. సెప్టెంబర్ 13న ఫోన్ అమ్మకానికి రానుంది. ముందుగా కొనుగోలు చేసే వారికి ఆరంభ వెర్షన్ ను రూ.10,999, హై ఎండ్ వెర్షన్ ను రూ.12,999కే ఇవ్వనున్నట్టు పోకో ప్రకటించింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. కాకపోతే బాక్స్ లో 22.5 వాట్ చార్జర్ ను పోకో అందించనుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

More Telugu News