Anakapalli District: అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి పరిస్థితి విషమం

Fire accident in crackers godown in Anakapalli district
  • సబ్బవరం మండలంలోని బాణసంచా గోడౌన్ లో పేలుడు
  • ఒక ముఠా రహస్యంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
  • వీరిలో ఇద్దరు కంచరపాలెంకు చెందిన వారిగా గుర్తింపు
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అరిపాక చిన్న యాతపాలెం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడున్న బాణసంచా గోడౌన్ లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని శంకర్ రావు, కమలమ్మ, మహేశ్, ప్రసాద్ గా గుర్తించారు.

మరోవైపు పేలుడుకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ముఠా రహస్యంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ ముఠాలో ఇద్దరు వ్యక్తులు కంచరపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Anakapalli District
Fire Accident
Crackers Godown

More Telugu News