ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ 12వ తేదీ వరకు వాయిదా
- ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశాలు
- మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపం ప్రకటించిన సభ్యులు
- కాసేపట్లో ప్రారంభం కానున్న బీఏసీ సమావేశం
అనంతరం తమ తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం, సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.