Puducherry: పుదుచ్చేరి జిప్‌మర్‌లో హైదరాబాద్‌ వైద్య విద్యార్థినిపై అత్యాచారం

Hyderabad medical student raped in puducherry jipmer
  • జిప్‌మర్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన విద్యార్థిని
  • సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు
  • కానిస్టేబుల్, అతడి స్నేహితుడికి అరదండాలు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్‌)లో ఏర్పాటు చేసిన వారం రోజుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఓ కానిస్టేబుల్, అతడి మిత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జిప్‌మర్ ఏర్పాటు చేసిన వారం రోజుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 20 ఏళ్ల బాధిత విద్యార్థిని గురువారం రాత్రి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియంలో వాకింగ్ చేస్తోంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన పుదుచ్చేరి కానిస్టేబుల్ కన్నన్ (31), అతడి స్నేహితుడు శివ ఆమెపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి నిన్న అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Puducherry
Hyderabad
Medical Student

More Telugu News