Telangana: మ‌రో 23 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ

tspcs releases a notification for fill up 23 posts in women and child welfare department
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 23 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
  • ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
  • రాత ప‌రీక్ష తేదీని త్వ‌ర‌లోనే ప్రకటిస్తామని వెల్లడి 
తెలంగాణ‌లో స‌ర్కారీ ఉద్యోగాల భ‌ర్తీ కోసం వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల‌వుతున్నాయి. ఆయా శాఖ‌ల్లోని ఖాళీల భ‌ర్తీకి ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి మంజూరు చేయ‌గా... ఇప్ప‌టికే వేలాది పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ అయ్యాయి. తాజాగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 23 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) సోమ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు రాత ప‌రీక్ష తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు క‌మిష‌న్ త‌న నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది.
Telangana
TRS
TSPSC

More Telugu News