క‌రోనా నుంచి కోలుకున్న కేటీఆర్‌... రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు

  • ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన కేటీఆర్‌
  • సోమ‌వారం పరీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు
  • కేటీఆర్‌కు క‌రోనా నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి
ktr tests negative for corona and will attend assembly from tomorrow

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవ‌లే క‌రోనా బారిన‌ప‌డిన మంత్రి కేటీఆర్‌కు సోమ‌వారం వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌గా... క‌రోనా నెగెటివ్‌గా వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఫ‌లితంగా క‌రోనా నుంచి కేటీఆర్‌ పూర్తిగా కోలుకున్న‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ పార్టీ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

రేప‌టి (మంగ‌ళ‌వారం) నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా బారిన ప‌డ్డ కేటీఆర్ ఈ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారా?  లేదా? అన్న విష‌యంపై నిన్న‌టిదాకా సందిగ్ధ‌త నెల‌కొన‌గా... అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఆ సందిగ్ధ‌త వీడిపోయింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల‌కు కేటీఆర్ హాజ‌ర‌వుతార‌ని టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది.

More Telugu News