Panchumarthi Anuradha: త్వరలో సీబీఐ వేసే ఛార్జ్ షీట్ తో తాడేపల్లి పునాదులు కదులుతాయి: పంచుమర్తి అనురాధ

Tadepalli will shake with CBI charge sheet says Panchumarthi Anuradha
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందన్న అనురాధ 
  • తన వాళ్లను కాపాడుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని వ్యాఖ్య 
  • లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏమిటనే విషయాన్ని కేంద్రం తేల్చాలని డిమాండ్ 
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీరిద్దరి పాత్ర ఉందని ఆమె అన్నారు. త్వరలో సీబీఐ వేసే ఛార్జిషీట్లతో తాడేపల్లి పునాదులు కదులుతాయని ఆమె చెప్పారు. 

లిక్కర్ స్కామ్ లో జగన్ అవినీతిని వెల్లడించినందుకే టీడీపీపై కక్ష కట్టారని అన్నారు. ఈ కారణంగానే చంద్రబాబు కుటుంబంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని... నారా భువనేశ్వరి, బ్రహ్మణిలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏమిటనే విషయాన్ని కేంద్రం వెంటనే తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
Panchumarthi Anuradha
Telugudesam
Delhi Liquor Scam

More Telugu News