లాభాల్లో ముగిసిన మార్కెట్లు

05-09-2022 Mon 15:55 | Business
  • 443 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 126 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.81 శాతం పెరిగిన సన్ ఫార్మా షేర్ విలువ
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి కూడా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 59,246కి చేరుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 17,666 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.81%), ఐటీసీ (1.78%), ఎన్టీపీసీ (1.70%), రిలయన్స్ (1.60%), టాటా స్టీల్ (1.28%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.06%), విప్రో (-0.54%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.25%), ఏసియన్ పెయింట్స్ (-0.18%).