Apple: ఈ నెల 7న యాపిల్ మెగా ఈవెంట్

Apples biggest launching event of 2022 happening on September 7
  • రాత్రి 10.30 గంటలకు మొదలు
  • పలు ఉత్పత్తులను ఆవిష్కరించనున్న టిమ్ కుక్
  • ఐఫోన్ 14 సిరీస్, వాచ్, ఐపాడ్స్ విడుదలపై అంచనాలు
యాపిల్ ఈ వారంలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 7న వర్చువల్ లాంచింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పలు హార్డ్ వేర్ ఉత్పత్తులతో పాటు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను కూడా ఆవిష్కరించనుంది.

ఆసక్తి కలిగిన వినియోగదారులు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో వీక్షించొచ్చు. అలాగే యాపిల్ వెబ్ సైట్, సోషల్ మీడియా చానల్స్ లోనూ వర్చువల్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. సెప్టెంబర్ 7న భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఇది మొదలవుతుంది. ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే నిజమైతే కార్యక్రమం ముగిసిన తర్వాత రికార్డెడ్ వీడియో రూపంలో చూడాల్సి వస్తుంది. గతంలో యాపిల్ ప్రత్యక్ష ప్రసారమే చేసింది. 

యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఎప్పటి మాదిరే నూతన ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. వాస్తవానికి 7వ తేదీ కార్యక్రమంలో విడుదల చేసే ఉత్పత్తుల వివరాలను యాపిల్ ఇంకా ప్రకటించలేదు. ఐఫోన్ 14 సిరీస్, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ప్రో, వాచ్ ఎస్ఈ, ఎయిర్ పాడ్స్ ప్రో 2 తదితర ఉత్పత్తులను ఆవిష్కరించొచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.
Apple
launching
event
apple iphone 14
ipods
ipad
apple watch

More Telugu News