Chandrababu: ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులకు గురవుతుండటం బాధాకరం: చంద్రబాబు

YSRCP govt torturing teachers says Jagan
  • బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారన్న చంద్రబాబు
  • విద్యాప్రమాణాలను నాశనం చేస్తున్నా ఎవరూ మాట్లాడకూడదంటున్నారని మండిపాటు
  • విద్యాశాఖలో సంస్కరణల పేరుతో సంక్షోభాన్ని తెచ్చారని విమర్శ
టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత ఉపాధ్యాయులదేనని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులకు గురవుతుండటం బాధాకరమని చెప్పారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నప్పటికీ ఎవరూ మాట్లాడకూడదు అని అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పాఠశాలల విలీనం పేరుతో బాలబాలికలకు విద్యను దూరం చేస్తున్నా మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు కోసం అడగకూడదా? అని అన్నారు. విద్యాశాఖలో సంస్కరణల పేరుతో సంక్షోభాన్ని తీసుకొచ్చారని.. ఈ సంక్షోభాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను గౌరవంగా చూడాలని అన్నారు.
Chandrababu
Telugudesam
Teachers
YSRCP

More Telugu News