నేడు నిజామాబాద్ కు కేసీఆర్.. పలువురు విద్యార్థి నేతల అరెస్ట్
- నిజామాబాద్ లో నూతన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
- అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం
- ఆ తర్వాత భారీ బహిరంగసభలో ప్రసంగించనున్న కేసీఆర్
అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. కలెక్టరేట్ లో పూజలు నిర్వహించిన అనంతరం... జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని సీట్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి సీఎం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ గులాబీమయంగా మారింది. ఇంకోవైపు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.