Manchu Manoj: భూమా మౌనికతో కలిసి కనిపించిన నటుడు మంచు మనోజ్.. పెళ్లి వార్తలపై త్వరలో చెబుతానన్న మోహన్‌బాబు తనయుడు

Tollywood Actor Manchu Manoj with Bhuma Mounika getting viral
  • సికింద్రాబాద్‌లో గణేశ్ మండపంలో మౌనికతో కలిసి పూజలు
  • పెళ్లి, రాజకీయ ప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాల దాటవేత
  • అహం బ్రహ్మస్మి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన మనోజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ నిన్న భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డితో కలిసి కనిపించడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు షికారు చేశాయి. సికింద్రాబాద్ టీఆర్టీ క్వార్టర్స్‌లో తన మిత్రుడు వరుణ్‌దేవ్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మనోజ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మౌనికారెడ్డి కూడా ఉండడంతో ఆ వార్త కాస్తా వైరల్ అయింది. వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువెత్తాయి. 

పూజల అనంతరం విలేకరులు మనోజ్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెళ్లి, సహా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ప్రశ్నలకు సమాధానాలను దాటవేసిన మనోజ్.. త్వరలోనే తన వివాహం, రాజకీయ ప్రవేశంపై వెల్లడిస్తానని చెప్పారు. అలాగే, ఆయన నటిస్తున్న ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ఆగిపోవడానికి కారణం చెప్పారు. కరోనా కారణంగానే సినిమా ఆగిందని అన్నారు. ప్రస్తుతం తాను, ఆ సినిమా దర్శకుడు వేరే సినిమాలతో బిజీగా ఉన్నామని, అందుకే ఆలస్యమవుతోందని మనోజ్ చెప్పుకొచ్చారు.
Manchu Manoj
Bhuma Mounika
Tollywood
Manchu Mohanbabu

More Telugu News