Chennupati Gandhi: చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: విజయవాడ సీపీ

Vijayawada CP tells investigation going on Chennupati Gandhi case
  • విజయవాడలో నిన్న టీడీపీ నేత గాంధీపై దాడి
  • కంటికి తీవ్రగాయం
  • ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్న సీపీ
  • దాడికి ఆయుధాలు వాడలేదని వెల్లడి
  • చేతులతోనే కొట్టారని వివరణ

టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై నిన్న విజయవాడ పటమటలంకలో దాడి జరగడం తెలిసిందే. గాంధీ కంటి వద్ద తీవ్రగాయం కాగా, ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వైసీపీ గూండాల పనే అంటూ టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో విచారణ జరుగుతోందని విజయవాడ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దాడికి ఎలాంటి ఆయుధాలు వాడలేదని, చేతులతోనే కొట్టారని సీపీ వివరించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి నివేదికలో కూడా చేతితో కొట్టినట్టుగానే ఉందని వెల్లడించారు. క్షణికావేశంలో చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News