Corona Virus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

  • 55 వేలకు తగ్గిన క్రియాశీల కేసులు 
  • గత 24 గంటల్లో కొత్తగా 6,809 కేసులు నమోదు
  • 98.69 శాతానికి పెరిగిన రికవరీ రేటు
corona cases decrease continues in india

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. కొన్నాళ్లుగా రోజువారీ కేసులు పది వేల లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 3,20,820 మందికి పరీక్షలు చేయగా కొత్తగా 6,809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 55,114 వేల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించింది. క్రియాశీల రేటు 0.12 శాతంగా నమోదైంది. 

గత 24 గంటల్లో 8,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  దేశంలో ఇప్పటిదాకా 4.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. ఇక, వ్యాక్సినేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 213 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 19,35,814 మందికి టీకాలు అందజేసినట్లు వెల్లడించింది.

More Telugu News