E commerce: అమెజాన్​, ఫ్లిప్​ కార్ట్​ లో ఐటమ్స్​ బుక్​ చేస్తున్నారా.. రైల్లో ఇలా తెస్తున్నారంటూ వీడియో వైరల్​

  • రైలు బోగీలోంచి ఇష్టమొచ్చినట్టుగా పార్సిళ్లను విసిరేస్తున్న సిబ్బంది
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన కొందరు నెటిజన్లు
  • అది పార్సిల్ సర్వీస్ అందించే కొరియర్ సర్వీస్ పని అంటూ కొందరి వివరణ
  • ఏదైతేనేం.. మాకు వచ్చే సామగ్రి దెబ్బతింటోందంటూ కొందరు వినియోగదారుల కామెంట్లు
E commerce parcels delivering like this

ఇటీవలి కాలంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో సామగ్రి బుక్ చేసుకోవడం చాలా పెరిగిపోయింది. తక్కువ ధరలకు, డిస్కౌంట్లతో ఇస్తుండటం, జస్ట్ అలా యాప్ లో బుక్ చేస్తే చాలు.. నేరుగా ఇంటి వద్దకే డెలివరీ ఇస్తుండటమే దీనికి కారణం. భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తుండటంతో ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ సర్వీసులను కూడా ప్రారంభించుకున్నాయి. అయితే ఆర్డర్ల డెలివరీకి సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వందల కొద్దీ పార్సిళ్లను..

  • ఓ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీ నుంచి వందల కొద్దీ ఈ కామర్స్ పార్సిళ్లను కొందరు ఇష్టం వచ్చినట్టుగా విసిరేస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.
  • ఒకరైతే మరీ ఇష్టారాజ్యంగా విసిరేయడంతో స్టేషన్ ప్లాట్ ఫాంపై ఉన్న ఫ్యాన్ కు పార్సిళ్లు తగిలి కిందపడ్డాయి.
  • నిజానికి ఈ పార్సిళ్లు ఇలా పడేయడానికి రైల్వేకు సంబంధం లేదని.. డెలివరీ సంస్థ వాళ్లే ఇలా చేస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
  • ఇందుకేనా నాకు వచ్చిన సామగ్రి పగిలిపోయి వచ్చింది అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీవీలు, ల్యాప్ టాప్ లు, ఫ్రిడ్జ్ లు కూడా ఇలా విసిరేస్తే ఎలా అని మరికొందరు అంటున్నారు.
  • ‘ఎవరు ఎలా విసిరేస్తే ఏంటి. మనకు వచ్చిన ఐటమ్ బాగో లేకుంటే రిటర్న్ ఇచ్చేస్తాం కదా..’ అని మరికొందరు పేర్కొంటున్నారు. 
  • ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేయగా.. ఏకంగా 31 లక్షల మందికిపైగా వీక్షించారు. 42వేలకుపైగా లైకులు, వేల కొద్దీ రీట్వీట్ లు నమోదయ్యాయి.

More Telugu News