Shabana Azmi: వీళ్లంతా 'టుక్డే టుక్డే గ్యాంగ్' ఏజెంట్లు.. బీజేపీ మంత్రి విమర్శలు

BJP minister fires on Shabana Azmi
  • షబానా అజ్మీ, జావెద్ అఖ్తర్, నసీరుద్దీన్ షాలపై నరోత్తమ్ మిశ్రా విమర్శలు 
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరిగినా వీరు గగ్గోలు చేస్తారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పాలిత ప్రాంతాల గురించి మాట్లాడరని విమర్శ
బాలీవుడ్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త జావెద్ అఖ్తర్, నటుడు నసీరుద్దీన్ షాలపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరంతా టుక్డే టుక్డే గ్యాంగ్ ఏజెంట్లని, ఆ గ్యాంగ్ స్లీపర్ సెల్స్ అని విమర్శించారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనే వీరు ఎప్పుడూ మాట్లాడుతుంటారని అన్నారు. రాజస్థాన్, ఝార్ఖండ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి వీరు మాట్లాడరని చెప్పారు. రాజస్థాన్ లో కన్హయ్య లాల్ హత్య గురించి కానీ, ఝార్ఖండ్ లో మహిళ సజీవ దహనం గురించి కానీ వీరు ఒక్క మాట కూడా మాట్లాడరని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే.. ఇక దేశంలో బతకడానికే భయమేస్తోందని వీరు అంటారని దుయ్యబట్టారు.
Shabana Azmi
Nasiruddin Shah
Javed Akhtar
BJP

More Telugu News