Padma Awards: పద్మ పురస్కారాల నామినేషన్లకు ఈ నెల 15 వరకు గడువు

Center issues timeline for Padma awards nominations and recommendations
  • పద్మ పురస్కారాల నామినేషన్లకు ఆహ్వానం
  • ఆన్ లైన్ లో నామినేషన్లు, సిఫారసుల స్వీకరణ
  • వెల్లడించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
దేశంలోని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల కోసం కేంద్రం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. 2023 పద్మ పురస్కారాలకు నామినేషన్ల దాఖలు చేసేందుకు తుది గడువు సెప్టెంబరు 15వ తేదీతో ముగియనుంది. నామినేషన్లను, సిఫారసులను ఆన్ లైన్ విధానంలో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాడు ఈ అవార్డులను ప్రకటించనున్నారు.
Padma Awards
Nominations
Recommendations
Timeline
India

More Telugu News