Nara Lokesh: అన్నం తినేవారెవ్వ‌రూ అన్నా క్యాంటీన్‌ను అడ్డుకోరు: నారా లోకేశ్

nara lokesh fires on ap police over ebstacles to anna canteen in tenali
  • తెనాలిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు
  • సీఎం జ‌గ‌న్‌కు మాన‌వ‌త్వ‌మే లేదా? అని లోకేశ్ ప్ర‌శ్న‌
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసి తీర‌తామ‌ని వెల్ల‌డి
గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు అయిన అన్నా క్యాంటీన్‌ను పోలీసులు అడ్డుకున్న తీరుపై ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్నం తినే వారెవ్వ‌రూ అన్నా క్యాంటీన్‌ను అడ్డుకోర‌ని ఆయ‌న ఘాటు వ్యాఖ్య చేశారు. ఇప్ప‌టికే నందిగామ‌, మంగ‌ళ‌గిరి, కుప్పంల‌లో త‌మ పార్టీ ఏర్పాటు చేయ‌త‌ల‌పెట్టిన అన్నా క్యాంటీన్ల‌ను అడ్డుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా తెనాలిలోనూ అన్నా క్యాంటీన్‌ను అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అస‌లు మాన‌వ‌త్వ‌మే లేదా? అని కూడా నారా లోకేశ్ ప్ర‌శ్నించారు. తెనాలిలో కేవలం అన్నా క్యాంటీన్‌ను అడ్డుకునేందుకే పోలీసు ప‌హారా పెట్ట‌డం దారుణ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసి తీర‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల‌తో రాష్ట్రంలోని నిరుపేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు.
Nara Lokesh
TDP
Tenali
Anna Canteen
Guntur District

More Telugu News