Amitabh Bachchan: అమితాబ్​, రష్మికల బాలీవుడ్​ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

1st poster of Amitabh Bachchan and Rashmika Mandannas comedy drama Goodbye out
  • సినిమాకు ‘గుడ్ బై’ టైటిల్ ఖరారు 
  • అమితాబ్ కు కూతురుగా నటిస్తున్న రష్మిక
  • ‘పుష్ప’తో హిందీ జనాలకు దగ్గరైన రష్మిక
తెలుగుతో పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. హిందీలో తన తొలి చిత్రంలోనే దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. వీరిద్దరు కలిసి నటించిన తాజా చిత్రానికి ‘గుడ్ బై’ అనే టైటిల్ ఖరారు చేశారు. 

ఈ క్రమంలో శనివారం ఉదయం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రష్మిక.. బిగ్ బీ కూతురుగా నటించింది. జీవితం, కుటుంబం, మానవ సంబంధాల గురించి మనసుకు హత్తుకునే కథ ఇది అని చిత్రబృందం చెబుతోంది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బై’ ప్రతి భారతీయ కుటుంబం యొక్క హృదయాన్ని కదిలించే కథ అంటోంది. 

తండ్రీ కూతుళ్ల మధ్య అందమైన ప్రేమను తెరపై చూపించనుంది. హాస్యం, హాయి, కన్నీళ్లతో నిండిన భావోద్వేగాలను ప్రేక్షకులకు పంచనుంది. అందుకు తగ్గట్టే తొలి పోస్టర్‌లో, అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న గాలిపటం ఎగురవేస్తూ  నవ్వుతూ కనిపించారు. ఫస్ట్ లుక్ ను బిగ్ బీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 

ఇక ఈ ‘గుడ్ బై’ చిత్రాన్ని  ఏక్తా కపూర్ నిర్మించారు. సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ‘గుడ్ బై’ అంత్యక్రియల చుట్టూ తిరిగే చిత్రం అన్న టాక్ ఉంది. అక్టోబర్ 7 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో విడుదలైన ‘పుష్ప’ సినిమాతో రష్మిక ఇప్పటికే బాలీవుడ్ జనాలకు దగ్గరైంది. ‘గుడ్ బై’ చిత్రం హిట్ అయితే హిందీలో కూడా రష్మికకు ఇక తిరుగు ఉండకపోవచ్చు.
Amitabh Bachchan
Rashmika Mandanna
good bye
movie
first look
poster
Bollywood

More Telugu News