Sharvanand: శర్వానంద్ కి ఈ సారైనా హిట్ పడేనా?

Oke Oka Jeevitam Movie Update
  • వరుస ఫ్లాపులతో ఉన్న శర్వానంద్ 
  • తాజా చిత్రంగా రూపొందిన 'ఒకే ఒక జీవితం'
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఎమోషనల్ జర్నీ 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల

శర్వానంద్ కి ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఎలాంటి పాత్రనైనా సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంటాడు. అయితే 'మహానుభావుడు' తరువాత ఆయనకి ఇంతవరకూ హిట్ పడలేదు. దాదాపు అరడజను ఫ్లాపులు ఆయన ఖాతాలో వరుసగా చేరిపోయాయి. 


అలాంటి శర్వానంద్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఒకే ఒక జీవితం' రెడీ అవుతోంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. పోస్టర్స్ చూసినా చాలామంది ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కి సంబంధించిన సినిమా అనుకున్నారు. బరువైన కథతో నడుస్తుందని భావించారు. 

కానీ ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ కి సంబంధించిన పాయింట్ ఉందనే విషయం ట్రైలర్ ద్వారా జనంలోకి వెళ్లింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై ఆందరిలో ఆసక్తి పెరగడం మొదలైంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాతోనైనా శర్వాకి హిట్ పడుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News