Redmi: 6వ తేదీన రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ల విడుదల

Redmi new made in India budget phone to be launched in India on September 6
  • దేశీయంగా తయారైన ఏ1 ఫోన్ విడుదల అదేరోజు
  • తక్కువ ధరకే విడుదలకు అవకాశం
  • రెడ్ మీ ప్రైమ్ 11 5జీ సహా పలు ఫోన్ల పరిచయం
రెడ్ మీ (షావోమీ బ్రాండ్) ఈ నెల 6న కొన్ని కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో రెడ్ మీ ఏ1 ఫోన్ కూడా ఉంది. ఇది పూర్తిగా భారత్ లో తయారైంది. పిల్ ఆకారంలో కెమెరా సెటప్ వెనుక భాగంలో కనిపిస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ వెనుక వైపు ప్రీమియం లెదర్ టెక్స్చర్ ఉంటుంది. ఈ ఫోన్ కు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా లీక్ కాలేదు. కాకపోతే తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుంది. 

రెడ్ మీ ప్రైమ్ 11 5జీ ఫోన్ ను సైతం షావోమీ అదే రోజు విడుదల చేయనుందని తెలుస్తోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ వోసీ చిప్ సెట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా ఉంటుంది. ఇందులో 6.58 అంగుళాల డిస్ ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
Redmi
made in India
budget phone
a1

More Telugu News