ఆండ్రాయిడ్ భవిష్యత్ వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్
- ఐఫోన్-14లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని ప్రచారం
- ఆండ్రాయిడ్ రాబోయే వెర్షన్ లో శాటిలైట్ ఫీచర్ ఉంటుందన్న గూగుల్
- ఆండ్రాయిడ్ 14లో కొత్త ఫీచర్ ఉండే అవకాశం
- నెట్వర్క్ లేకపోయినా కాల్స్, ఎస్సెమ్మెస్ లు
దీనిపై ఆండ్రాయిడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు హిరోషి లోషిమెర్ స్పందించారు. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే, నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్ తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, ఎస్సెమ్మెస్ లు పంపుకోవచ్చు. కాగా, ఐఫోన్-14 మోడల్స్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత లేదు.