Cheating: తిరుమలలో పర్మినెంట్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

Cheating at Tirumala in the pretext of permanent jobs
  • తిరుమల కొండపై ఉద్యోగాల కుంభకోణం
  • ఓ యువకుడి నుంచి లక్ష వసూలు చేసిన వైనం
  • మోసపోయానని గ్రహించిన యువకుడు
  • టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
తిరుమలలో ఉద్యోగాల కుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. తిరుమలలో పర్మినెంటు ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. లడ్డూ కౌంటర్లు నిర్వహించే కేవీఎం సంస్థ సిబ్బందిపై ఫిర్యాదులు అందాయి. అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన వ్యక్తి నుంచి సిబ్బంది లక్ష రూపాయలు తీసుకున్నట్టు వెల్లడైంది. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, తిరుమల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తిరుమలలో గతంలోనూ ఇలాంటి దందాలు వెలుగుచూడడం తెలిసిందే.
Cheating
Permanent Jobs
Tirumala
TTD
Police

More Telugu News