రేపు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం... తిరువనంతపురం చేరిన మహమూద్ అలీ
- అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సమావేశం
- తిరువనంతపురం చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
- కేరళ సీఎంతో కలిసి పలు అంశాలపై చర్చలు
ఇదిలా ఉంటే... ఈ భేటీలో పాల్గొనేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా శుక్రవారం రాత్రికే తిరువనంతపురం చేరుకున్నారు. ఆయనకు కేరళ సీఎం పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేపటి భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై స్టాలిన్, విజయన్‌ల మధ్య చర్చ జరిగింది. కేరళ, తమిళనాడుల మధ్య సత్సంబంధాలపైనా ఇద్దరు సీఎంలు చర్చించారు.