Student: బస్సు డోర్​ దగ్గర కిక్కిరిసి నిలబడి.. వేగంగా వెళ్తుండగా కిందపడిన విద్యార్థి.. కొద్దిలో తప్పిన ప్రమాదం.. వీడియో ఇదిగో

  • తమిళనాడులోని మేల్మరు వత్తూరులో ఘటన
  • వెనుకాల బైక్ పై వస్తున్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్
  • హైదరాబాద్ లోనూ బస్సులు ఇలాగే కిక్కిరిసి వెళతాయంటూ కామెంట్లు
Standing crowded Bus near door student fell down and accident that narrowly missed

బస్సుల్లో జనం కిక్కిరిసి ప్రయాణించడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. అందులోనూ కాలేజీలు, స్కూళ్లు ముగిసి ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఉండే రద్దీ మరీ ఎక్కువ. బస్సుల డోర్ల వద్ద, ఫుట్ బోర్డులపై నిలబడి ప్రయాణిస్తుంటారు. కేవలం ఫుట్ బోర్డు మీదనే పది, పదిహేను మందికిపైగా నిలబడుతుంటారు. అలాంటప్పుడు ఒక్కోసారి జారి పడుతూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని మేల్మరువత్తూరులో ఓ బస్సు నుంచి విద్యార్థి పడిపోయిన వీడియో వైరల్ గా మారింది.

  • బస్సులో నిండా ప్రయాణికులు ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డు వద్ద రాడ్ ను పట్టుకుని నిలబడ్డారు. ఖాళీగా ఉన్న రోడ్డులో బస్సు వేగంగా దూసుకెళ్తోంది.
  • ఈ క్రమంలో సుమారు పన్నెండు, పదమూడేళ్ల విద్యార్థి పట్టుతప్పి పడిపోయాడు. అదీ బస్సు వెనుక చక్రం పక్కనే పడ్డాడు. బస్సు మాత్రం ముందుకు వెళ్లిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది.
  • ఒకవేళ ఆ విద్యార్థి కాస్త ముందు పడి ఉంటే.. చాలా తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  • తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇది చూసినవారు దారుణమంటూ కామెంట్లు పెడుతున్నారు.
  • హైదరాబాద్ లో హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వెళ్లే బస్సుల్లో ఇలాగే ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణిస్తారని మరొకరు కామెంట్ పెట్టారు.

More Telugu News