Vikram: అందగత్తె ఆశలన్నీ ఆవిరైనట్టేనా?

Srinidhi Shetty Special
  • అందాల భామగా అనేక బహుమతులు అందుకున్న శ్రీనిధి 
  • మోడలింగ్ లోను తన సత్తాను చూపుతున్న బ్యూటీ 
  • 'కేజీఎఫ్' సినిమాతో వెండితెరకి పరిచయం 
  • 'కోబ్రా' ఫ్లాప్ తో డీలాపడిన అభిమానులు
శ్రీనిధి శెట్టి చేసిన సినిమాలకంటే, హీరోయిన్ కావడానికి ముందు అందగత్తెగా ఆమె గెలుచుకున్న బహుమతులు ఎక్కువ .. పొందిన బిరుదులు ఎక్కువ. ఇక మోడలింగ్ లోను అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న వారిలో ఆమె ఒకరు. అలాంటి ఆమె 'కేజీఎఫ్' సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 

ఆ తరువాత ఆమె 'కేజీఎఫ్ 2' పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఆ సినిమా సమయంలో ఆమె 'కోబ్రా' సినిమా తప్ప మరో సినిమా చేయలేదు. వరుసగా వచ్చిన ఆఫర్లను ఆమె హోల్డ్ లో పెట్టి 'కోబ్రా' తరువాత చెబుతానని అందట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పారితోషికం పరంగా ఆమెను పట్టుకోవటం కష్టమని అంతా అనుకున్నారు. అయితే, తమిళనాట మొన్న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

 ఇక తెలుగులోను ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో శ్రీనిధి శెట్టి ఆశలన్నీ ఆవిరైనట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' తరువాత ఆమె వరుస సినిమాలను అంగీకరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆమె అభిమానులను నిరాశపరుస్తున్న విషయం.
Vikram
Srinidhi Shettty
Cobra Movie

More Telugu News