UPI: ఆగస్ట్ లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

  • 657 కోట్ల యూపీఐ లావాదేవీల నమోదు
  • వీటి విలువ రూ.10.93 లక్షల కోట్లు
  • ప్రతి నెలా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు
UPI transactions hit record 657 crore in August

కరోనా తర్వాత నుంచి దేశంలో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల నమోదు దిశగా దూసుకుపోతున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను డిజిటైజ్ చేయడంపై దృష్టి సారించడం తెలిసిందే. ఇందులో భాగంగానే 2016లో డీమోనిటైజేషన్. వ్యవస్థలో నల్లధనాన్ని తొలగించాలన్న వ్యూహం ఫలించింది. కాకపోతే ఎక్కువ మొత్తం వైట్ గా మారింది లెండి. ఇదంతా రికార్డుల్లోకి చేరినందున ఆ మేరకు ప్రయోజనాలు ఉంటాయి.


డిజిటైజ్ చేయడం వల్ల అవినీతికి, పన్నుల ఎగవేతకు చెక్ పెట్టొచ్చన్నది సర్కారు వ్యూహం. అందుకే ఆ తర్వాత కాలంలో జీఎస్ టీ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కరోనా వైరస్ రాకతో అనూహ్యమైన మార్పు చెల్లింపుల పరంగా చోటు చేసుకుంది. ప్రజలు నోట్ల ద్వారా చెల్లింపులు చేస్తే కరోనా వైరస్ వస్తుందేమోనని డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. అలా యూపీఐ ఆధారిత లావాదేవీలు అప్పటి నుంచి శరవేగంగా పెరుగుతూ వస్తున్నాయి.

ఆగస్ట్ లో యూపీఐ ఆధారిత 657 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.10.93 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ప్రకటించింది. సంఖ్యా పరంగా 85 శాతం పెరిగితే, విలువ పరంగా 68 శాతం వృద్ధి నెలకొంది. దేశీయంగా సక్సెస్ అయిన యూపీఐ విధానాన్ని విదేశాలకు కూడా తీసుకెళ్లాలన్నది ఎన్ పీసీఐ ఆలోచనగా ఉంది. ఇక ఈ ఏడాది జులైలో యూపీఐ ఆధారిత లావాదేవీలు 600 కోట్లుగా, విలువపరంగా రూ.10.63 లక్షల కోట్లుగా ఉంది.

More Telugu News