తన తండ్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేసిన జగన్

  • నాన్న భౌతికంగా దూరమైనా ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయన్న జగన్
  • దేశ చరిత్రలో సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారని ట్వీట్
  • నాన్నే స్ఫూర్తిగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న సీఎం
Jagan emotional tweet on his fathers death anniversary

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన తండ్రిని తలచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది' అని ట్వీట్ చేశారు.

More Telugu News