Telangana: స్నో వ‌రల్డ్‌ను సీజ్ చేసిన తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ

  • ప్ర‌భుత్వానికి రూ.16 కోట్ల మేర ప‌న్ను బ‌కాయి ప‌డ్డ స్నో వ‌ర‌ల్డ్‌
  • నోటీసులు ఇచ్చినా స్పందించని ప‌ర్యాట‌క కేంద్రం
  • మ‌రో 16 ప‌ర్యాట‌క కేంద్రాల‌కూ నోటీసులు ఇచ్చామ‌న్న ప‌ర్యాట‌క శాఖ‌
ts tourism department siezes snow world

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రం స్నో వ‌ర‌ల్డ్‌ను రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఏళ్ల త‌ర‌బ‌డి కార్య‌క‌లాపాలు సాగిస్తున్న స్నో వ‌ర‌ల్డ్ ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన రూ.16 కోట్ల‌ ప‌న్నును మాత్రం ఎగ‌వేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై స్నో వ‌రల్డ్ స‌హా ప‌న్ను బ‌కాయిలు ఉన్న ప‌ర్యాట‌క కేంద్రాల‌కు తెలంగాణ స‌ర్కారు నోటీసులు జారీ చేసింది.

స‌ర్కారు నుంచి జారీ అయిన నోటీసుల‌ను కూడా స్నో వ‌రల్డ్ ప‌ట్టించుకోలేదు. దీంతో గురువారం రంగంలోకి దిగిన ప‌ర్యాట‌క శాఖ అధికారులు స్నో వ‌ర‌ల్డ్‌ను సీజ్‌చేశారు. ఈ సంద‌ర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని మ‌రో 16 ప‌ర్యాట‌క కేంద్రాలు ప‌న్ను బ‌కాయిలు ఉన్నాయ‌ని తెలిపారు. నిర్దేశించిన గ‌డువులోగా ఆ సంస్థ‌లు కూడా ప‌న్నులు క‌ట్ట‌క‌పోతే వాటిని కూడా సీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

More Telugu News