Vikram: విక్రమ్ గెటప్పులన్నీ విఫలమయ్యాయా?

  • నిన్ననే విడుదలైన 'కోబ్రా'
  • కథానాయికగా శ్రీనిధి శెట్టి
  • ఏడు గెటప్పులలో కనిపించిన విక్రమ్ 
  • బలమైన కథ లేకపోవడం ఫలించని ప్రయత్నం  
 Cobra movie update

మొదటి నుంచి కూడా విక్రమ్ విభిన్నమైన పాత్రలను పోషించడానికీ, పాత్రకి తగినట్టుగా డిఫరెంటు గెటప్పులలో కనిపించడానికి ఆసక్తిని చూపుతూ వచ్చాడు. ఏ పాత్రను పోషించినా అందులో ఆ పాత్ర తప్ప విక్రమ్ కనిపించడు అనే ఒక మంచి పేరును ఆయన సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కోబ్రా' నిన్ననే థియేటర్లకు వచ్చింది. 

ఈ సినిమాలోను విక్రమ్ 7 గెటప్పులలో కనిపిస్తాడు. కొన్ని గెటప్పులలో విక్రమ్ ను గుర్తు కూడా పట్టలేం. అంత బాగా ఆయన ఆ పాత్రల్లో ఒదిగిపోయాడు. అయితే ఆయన కష్టాన్ని ప్రేక్షకులు ఎంత మాత్రం పట్టించుకోలేదు. అందుకు కారణం బలహీనమైన కథలోని ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడమే. 

'దశావతారం'లో కమల్ పది గెటప్పులు వేశారంటే ఆ పాత్రల వెనుక ఒక బలమైన ప్రయోజనం కనిపిస్తుంది. కథలో ఆ పాత్రలు ఎక్కడ ఎంటర్ కావాలో అక్కడే వచ్చి, ఇతర పాత్రలకి అవకాశమిస్తూ పక్కకి తప్పుకుంటూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో విక్రమ్ ఎందుకు ఆ గెటప్పులు ధరించాడనేది ఎవరికీ అర్థం కాదు. సరైన కారణం లేకుండా వేయడం వల్లనే ఆ గెటప్పులన్నీ వృథా అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News