GST: ఆగ‌స్టు నెల‌లో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1.43 ల‌క్ష‌ల కోట్లు... గ‌తేడాది ఇదే నెల కంటే 28 శాతం వృద్ధి

  • ఈ ఆగ‌స్టు నెల‌లో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1,43,612 కోట్లు
  • గ‌తేడాది ఇదే మాసంలో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1,12,020 కోట్లు
  • 28 శాతం మేర వృద్ధి న‌మోదైన‌ట్లు వెల్ల‌డించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌
Rs 143612 crore gross GST revenue collected in August 2022

దేశంలో గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వ‌సూళ్ల‌లో క్ర‌మానుగ‌త వృద్ధి న‌మోదు అవుతోంది. ఏటికేడు జీఎస్టీ వ‌సూళ్ల‌లో వృద్ధి న‌మోదు అవుతున్న తీరుపై కేంద్ర ప్ర‌భుత్వం నెల‌వారీగా వివ‌రాలు వెల్ల‌డిస్తోంది. బుధ‌వారంతో ముగిసిన ఆగ‌స్టు నెల జీఎస్టీ వ‌సూళ్ల‌కు సంబంధించి గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ కార్యాల‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం ఆగ‌స్టు నెల‌లో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1,43,612 కోట్లుగా న‌మోద‌య్యాయి. ఈ ఏడాది జులై మాసం (రూ.1,48,995 కోట్లు)తో పోలిస్తే... ఆగ‌స్టు నెల‌లో రూ.20 వేల కోట్ల మేర వ‌సూళ్లు త‌గ్గాయి. అయితే గ‌తేడాది ఆగ‌స్టు మాసంతో జీఎస్టీ వ‌సూళ్లు (రూ.1,12,020 కోట్లు)తో పోలిస్తే... ఈ ఆగ‌స్టు నెల‌లో 28 శాతం మేర వృద్ధి న‌మోదైంది.

More Telugu News