AR Rahman: ఎటు వెళ్లినా.. మా గమ్యస్థానం తమిళనాడే: ఏఆర్ రెహమాన్

AR Rahman bumps into Ilaiyaraaja at airport says destination is always Tamil Nadu
  • చెన్నై ఎయిర్ పోర్ట్ లో తారసపడ్డ రెహమాన్, ఇళయరాజా
  • సెల్ఫీ వీడియో తీసుకున్న రెహమాన్
  • తాము ఏ దేశం వెళ్లినా తిరిగొచ్చేది తమిళనాడుకేనంటూ కామెంట్ 
ప్రముఖ సంగీత దర్శకులు ఇద్దరూ ఒకే చోట చేరారు. అది కూడా చెన్నై విమానాశ్రయంలో. వారే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. దీన్ని రెహమాన్ ప్రాంతీయత కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘మేము భిన్న దేశాల నుంచి తిరిగొస్తున్నాం. కానీ, మా గమ్యస్థానం ఎప్పుడూ తమిళనాడే’’ అని రెహమాన్ పేర్కొన్నారు.

ఇళయరాజాతో సెల్ఫీ వీడియో తీసుకున్న రెహమాన్ దానిని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇళయరాజా బుడాపెస్ట్ నుంచి తిరిగి రాగా, రెహమాన్ అమెరికా నుంచి తిరిగొచ్చారు. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఎదురెదురుగా తారసపడ్డారు. అభిమానులు దీనికి హార్ట్ ఎమోజీలతో స్పందన తెలియజేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మణిరత్నంతో రెహమాన్ కు ఇది 15వ ప్రాజెక్టు కానుంది. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)
AR Rahman
Ilaiyaraaja
Meet
chennai airport

More Telugu News