Zomato: జొమాటో కొత్త సర్వీస్.. ఢిల్లీలో కూర్చుని హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు

Zomato will soon allow users to order biryani kebabs and more from different Indian cities
  • జొమాటో ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్ ప్రారంభం
  • గురుగ్రామ్, సౌత్ ఢిల్లీలో ప్రయోగాత్మక సేవలు
  • తర్వాత దేశవ్యాప్తంగా విస్తరణ
హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో తెలుసు. అలాగే, బెంగళూరు మైసూర్ పాక్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కోల్ కతా రసగుల్లా పేరు చెబితే నోటిలో లాలాజలం ఊరాల్సిందే. లక్నో కెబాబ్ లు, పాత ఢిల్లీ బటర్ చికెన్, జైపూర్ ప్యాజ్ కచోరి ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. స్థానికులు వాటిని సులభంగానే తినొచ్చు. కానీ, ఒక ప్రాంతానికి సంబంధించి పేరొందిన డిష్ ను వేరే ప్రాంతంలోని వారికి తినాలి అనిపిస్తే ఎలా? విమానం ఎక్కి రాలేరుగా..?

అందుకే ఇటువంటి వారికి కోరుకున్న డిష్ ను వేరే ప్రాంతాల నుంచి అందించే కొత్త సేవను జొమాటో ప్రారంభించింది. దీని పేరు జొమాటో ఇంటర్ సిటీ లెజెండ్స్. అంటే రెండు పట్టణాల మధ్య సర్వీసు అన్నమాట. ఇప్పటి వరకు లోకల్ రెస్టారెంట్ ఫుడ్ తోనే సరిపెట్టుకుంటున్న.. భోజన ప్రియులకు ఇప్పుడు జొమాటో రూపంలో మంచి అవకాశం లభించింది. ఆర్డర్ చేసిన వారికి ఏ మాత్రం గాలి చొరబడని ప్యాక్ లో, పదార్థం పాడైపోకుండా మరుసటి రోజున జొమాటో అందిస్తుంది. ఇందుకోసం విమాన కార్గో సేవలను ఉపయోగించుకుంటుంది. ముందుగా గురుగ్రామ్, సౌత్ ఢిల్లీ వాసులకు ప్రయోగాత్మకంగా జొమాటో ఈ సర్వీస్ ఆఫర్ చేస్తోంది.
Zomato
intercity
legends
food delivery

More Telugu News