సెప్టెంబర్ నెలను భారీ నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు

  • అంచనాలను అందుకోలేకపోయిన జీడీపీ గణాంకాలు
  • మార్కెట్లు ప్రారంభమైన వెంటనే దాదాపు 650 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • ప్రస్తుతం 258 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న సెన్సెక్స్
Markets trading in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెలను భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్ల వరకు పతనమయింది. నిన్న వెలువడిన జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోకపోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

అయితే ప్రస్తుతం మార్కెట్లు కొంత పుంజుకునే దిశగా కొనసాగుతున్నాయి. ఉదయం 10.07 గంటల సమయంలో సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 59,279 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 17,684 వద్ద కొనసాగుతోంది. ఐటీ, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్, మెటల్, పవర్ సూచీలు ఎక్కువగా నష్టపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టీసీఎస్ 2 శాతానికి పైగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్ కంపెనీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

More Telugu News