Tarun: మహేశ్ బాబు సినిమాతో రీ ఎంట్రీ వార్తలపై స్పందించిన తరుణ్

tollywood  actor tarun responds over reentry with mahesh film
  • ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో తరుణ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు
  • పాత్ర నచ్చడంతో అంగీకరించినట్టు సోషల్ మీడియా టాక్
  • అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తరుణ్ స్పష్టీకరణ
మహేశ్‌బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వస్తున్న వార్తలపై నటుడు తరుణ్ స్పందించారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఎస్ఎస్ఎంబీ 28గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇక ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం తరుణ్‌ను సంప్రదించిందని, పాత్ర నచ్చడంతో తరుణ్ కూడా ఓకే చేశాడన్నది టాలీవుడ్ టాక్. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తరుణ్ మళ్లీ ఇలా మహేశ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై తాజాగా తరుణ్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదంటూ పుకార్లకు చెక్ పెట్టాడు. అలాంటిదేమైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తరుణ్ తేల్చి చెప్పాడు.
Tarun
Tollywood
SSMB 28
Mahesh Babu

More Telugu News