Chandrababu: గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదు: చంద్రబాబు

  • రేపు వినాయక చతుర్థి
  • శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • స్వతంత్రపోరాటంలో ప్రజలను ఏకంచేసిన పండుగ అని వెల్లడి
  • అందరికీ సుఖసంతోషాలు పంచాలని ఆకాంక్ష
Chandrababu says govt does not implement measures during Vinayaka Chavithi

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందించారు.  వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ఏకంచేసి, వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాంటి గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

గణనాయకుని భక్తిశ్రద్ధలతో ఆరాధించే ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News