Budi Mutyalanaidu: నా సొంతూర్లో నీటి ఎద్దడి లేదని నిరూపిస్తే నీ చానల్ మూసుకుంటావా?: మీడియా ప్రతినిధికి సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

Dy CM Budi Mutyalanaidu challenges media reporter
  • విశాఖలో డిప్యూటీ సీఎం మీడియా సమావేశం
  • మంత్రి సొంతూర్లో నీటి ఎద్దడిపై ప్రశ్నించిన పాత్రికేయుడు
  • నీటి ఎద్దడి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ముత్యాలనాయుడు
విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఓ పాత్రికేయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్వగ్రామంలో నీటి ఎద్దడిపై ఓ చానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దాంతో ఆయన ఆవేశంతో ఊగిపోయారు. తన సొంతూర్లో నీటి ఎద్దడి లేదని నిరూపిస్తానని, ఆ మీడియా సంస్థ తన పత్రికను, చానల్ ను మూసుకుంటుందా? అని ముత్యాలనాయుడు సవాల్ విసిరారు. ఒకవేళ తన గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే తాను అన్ని పదవులకు రాజీనామా చేయడమే కాకుండా, రాజకీయాల నుంచి కూడా వైదొలగుతానని స్పష్టం చేశారు.  
Budi Mutyalanaidu
Media Reporter
Challenge
YSRCP
Visakhapatnam

More Telugu News