Odela Railway Station Movie: ఓటీటీలో దూసుకుపోతున్న హెబ్బా పటేల్ 'ఓదెల రైల్వేస్టేషన్'

Hebba Patel movie Odela Railway Station is streaming successfully in AHA OTT
  • కథ, స్క్రీన్ ప్లే అందించిన దర్శకుడు సంపత్ నంది
  • ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం
  • మూడు రోజుల్లోనే 1.5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకుందన్న సంపత్
యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వేస్టేషన్' చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రికార్డు స్థాయి వ్యూస్ తో సత్తా చాటుతోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించగా... అశోక్ తేజ్ దర్శకత్వం వహించారు. వశిష్ట సింహ, పూజిత పొన్నాడ, సాయి రోనక్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ నెల 26 నుంచి ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. రోజురోజుకూ ఈ సినిమా వ్యూయర్ షిప్ పెరుగుతోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 1.5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుందని సంపత్ నంది తెలిపారు. సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంపత్ నంది చివరిగా గోపీచంద్ తో 'సీటీమార్' సినిమాను తెరకెక్కించారు.
Odela Railway Station Movie
Tollywood
Hebba Patel
OTT
AHA
Sampath Nandi

More Telugu News