Ranveer Singh: న్యూడ్ షో వల్ల వచ్చే పరిణామాలపై నాకు అవగాహన లేదు: పోలీసు విచారణలో రణవీర్ సింగ్

  • రణవీర్ నగ్న ఫొటోలపై పోలీసు కేసులు 
  • చెంబూరు పోలీస్ స్టేషన్లో విచారణకు రణవీర్  
  • తాను ఫొటోలను అప్ లోడ్ చేయలేదని జవాబు 
  • అన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన రణవీర్
Ranveer Singh calm told police he wasnt aware of effects of photo shoot

రణవీర్ సింగ్ పోలీసుల విచారణ సందర్భంగా అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. ఆ మధ్య ఓ మేగజైన్ ముఖ చిత్రం కోసం నగ్నంగా ఫొటోలు దిగడం (న్యూడ్ ఫొటో షూట్) తెలిసిందే. దీన్ని కొందరు అభ్యంతరకరంగా భావించారు. దీనిపై పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి. దీనికి సంబంధించిన కేసులోనే రణవీర్ సింగ్ ను పోలీసులు విచారించారు. 

ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్ కు ఉదయం 7 గంటలకు రణవీర్ సింగ్ చేరుకోగా, 9 గంటల వరకు పోలీసులు ఆయన్ను విచారించారు. తన న్యూడ్ ఫొటోషూట్ పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అతడు అదే విధానాన్ని కొనసాగించాడు. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదని మాత్రం బదులిచ్చాడు.

ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలే కానీ, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ కు అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్ లోడ్ చేయలేదని, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలిపాయి. ఫొటో షూట్ సందర్భంగా నటుడిగా సృజనాత్మకత మార్గదర్శనం మేరకు పనిచేసినట్టు చెప్పాడు. 

ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద రణవీర్ సింగ్ పై కేసులు నమోదై ఉన్నాయి. అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు.

More Telugu News