గణపతి బప్పా మోరియా.. ముంబై వినాయకుడిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

30-08-2022 Tue 12:09 | Entertainment
  • ముంబైలోని పుట్లబాయ్ చావల్ లో కొలువైన గణనాథుడు
  • ముంబై ఆత్మను లాల్ బాగ్చారాజా కంటే గొప్పగా ఎవరూ వ్యక్తం చేయలేరన్న ఆనంద్ మహీంద్రా
  • ట్విట్టర్లో వీడియో షేర్
What best describes the heart and soul of Mumbai Anand Mahindra says its Lalbaugcha Raja
వినాయక చవితి వేడుకలకు యావత్ భారతదేశం సన్నద్ధమవుతోంది. వినాయకుడి విగ్రహాలతో తొమ్మిది రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలోనూ గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. 

ముఖ్యంగా ముంబైలో ప్రసిద్ధి చెందిన, ఖరీదైన గణేశ్ మండపాలు చాలానే ఉన్నాయి. అందులో లాల్ బాగ్చా రాజా కూడా ఒకటి. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో తనను ఫాలో అయ్యే వారితో పంచుకున్నారు. 

‘ముంబై హృదయం, ఆత్మను లాల్ బాగ్చా రాజా కంటే మరెవరూ గొప్పగా ప్రతిఫలించలేరు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పుట్లబాయ్ చావల్ లో కింగ్ ఆఫ్ లాల్ బాగ్ (లాల్ బాగ్చా రాజా) ఆలయం ఉంది. గణపతి బప్పా మోరియా అంటూ ఆనంద్ మహీంద్రా జై కొట్టారు. దీనికి స్పందనగా యూజర్లు ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో కొలువైన ఇతర గణనాథుని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.