2020 నాటి వివాదాస్పద ట్వీట్ కేసు.. బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ అరెస్ట్

30-08-2022 Tue 09:55 | Entertainment
  • బాలీవుడ్‌పై నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించే కేఆర్కే
  • ఆయనను వెన్నంటి ఉండే వివాదాలు
  • నేడు బొరివలీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
Kamaal R Khan arrested in mumbai airport over controversial tweet
'కేఆర్కే'గా చిరపరిచితమైన బాలీవుడ్ నటుడు, నిర్మాత, రచయిత కమల్ రషీద్ ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ట్వీట్లు తరచూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. బాలీవుడ్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అరెస్టయ్యారు. 

2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై మలాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ప్రశ్నించేందుకు పోలీసులు ఆయనను ముంబై ఎయిర్ ‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను బొరివలీ కోర్టులో ప్రవేశపెడతారు. కమాల్ ఆర్ ఖాన్ పలు హిందీ సినిమాలతోపాటు భోజ్‌పురి సినిమాల్లోనూ నటించారు. పలు సినిమాలు నిర్మించారు. బిగ్‌బాస్-3లోనూ పాల్గొన్నారు.