Virat Kohli: పాకిస్థాన్ ఆటగాడికి తన జెర్సీని కానుకగా ఇచ్చిన కోహ్లీ... వీడియో ఇదిగో!

Kohli presents his jersey to Pakistan speedster Haris Rauf
  • దుబాయ్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • ఆసియా కప్ లో శుభారంభం చేసిన భారత్
  • పాక్ పై అద్భుత విజయం
  • మ్యాచ్ అనంతరం కోహ్లీ, రవూఫ్ ముచ్చట్లు
ఆసియా కప్ టోర్నీలో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించడం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ కు తన జెర్సీని కానుకగా ఇచ్చాడు. ఆ జెర్సీపై సంతకం కూడా చేశాడు.

అంతకుముందు, రవూఫ్ తో కోహ్లీ ముచ్చటించాడు. ఇరువురు కాసేపు క్రికెట్ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం తన 18వ నెంబరు జెర్సీని రవూఫ్ కు అందించి, ఆల్ ది బెస్ట్ చెప్పి కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

Virat Kohli
Haris Rauf
Jersey

More Telugu News