Prabhas: తాత - మనవడు నేపథ్యంలో ప్రభాస్ సినిమా!

  • 'ప్రాజెక్టు K ' పనుల్లో బిజీగా ప్రభాస్ 
  • తరువాత సినిమా మారుతి దర్శకత్వంలో
  • ఓ సినిమా థియేటర్ నేపథ్యంలో నడిచే కథ 
  • ఆల్రెడీ రెడీ అయిన భారీ సెట్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు 
Prabhas in Maruthi Movie

ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్టు K' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆ తరువాత ప్రభాస్ 'స్పిరిట్' సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాల మధ్యలో మారుతి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. 

ఈ సినిమాకి మారుతి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. 'రాజా డీలక్స్' అనేది ఒక థియేటర్. ఆ థియేటర్ చుట్టూ తిరిగే హారర్ కామెడీనే ఈ సినిమా అనే టాక్ బయటికి వచ్చింది. హైదరాబాదులోని ఒక స్టూడియోలో అందుకు సంబంధించిన సెట్ వేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. 

ఈ కథ తాత - మనవడు అనే రెండు ప్రధాన పాత్రలను ఆధారంగా చేసుకుని నడుస్తుందనేది తాజా సమాచారం. మారుతి ఇంతవరకూ చేస్తూ వచ్చిన బడ్జెట్ లోనే ఈ సినిమా ఉంటుందట. కాకపోతే కథాపరంగా ప్రభాస్ స్థాయిలో ఉంటూ పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు సందడి చేస్తారనేది చూడాలి.

More Telugu News